కరోనా పాట

=========

 

దాని పేరు కరోనా దాని ఇల్లు చైనా

పురుగు లాగ పుట్టింది. పుడమి అంతా పాకింది.

మన దేశం వచ్చింది మన ఇంటికి వస్తుంది

జాగ్రత్తగా లేకుంటే మన కొంప ముంచుతుంది.

 

కరోనా…  కరోనా…  కరుణ లేని కరోనా……

 

చుట్టంలా చెప్పి రాదు. చుట్టం చూపుగా పోదు

చాప కింద నీరై వచ్చి చుట్టబెట్టుకు పోతుంది

కూలి లేదు, కునుకు లేదు, తినడానికి తిండి లేదు.

కష్టాలను తెచ్చింది. కన్నీరే మిగిల్చింది.

 

కరోనా…  కరోనా…  కరుణ లేని కరోనా……

 

గుడి లేదు, బడి లేదు. అన్నిటికీ తాళమేసె

జాబులన్నీ పోగొట్టే. జేబులకు చిల్లు పెట్టె

కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టించే

ఒంటికంటుకున్నదంటే ప్రాణానికే ముప్పు తెచ్చు

 

కరోనా…  కరోనా…  కరుణ లేని కరోనా……

 

ఇంటి కంచె దాటొద్దు. కరోనాకు దొరకొద్దు

మాస్కులేస్కు తిరగండి. రిస్కు మీకు లేదండి

వేడి నీరు తాగుతూ, వేళకు తిండిని తింటూ

లోపలనే ఉంటూ ఓపికగా మెలగండి.

 

కరోనా…  కరోనా… డరోనా…   డరోనా…

 

క్లబ్బులొద్దు పబ్బులొద్దు సినిమా హాళ్ళన్నీ రద్దు

చేయి చేయి కలపవద్దు. చేతులు జోడించు ముద్దు

ప్రభుత్వాల మాటలు శ్రద్ధగా పాటించండి

ఊరేగడమెందుకండి.  ఊపిరుంటే చాలునండి…

 

కరోనా…  కరోనా… డరోనా…   డరోనా…

 

 

 

Comments to: కరోనా పాట

Your email address will not be published. Required fields are marked *

Attach images - Only PNG, JPG, JPEG and GIF are supported.