అక్కి నేని

అక్కి నేని

‘అంతస్తులు’ లేని ‘అన్నదాత’ కుటుంబంలో జన్మించాడు.

తల్లిదండ్రులు ‘ఆస్తిపరులు’ కాకపోయినా  ‘అభిమానం’ కలవారు

‘మహా కవి కాళిదాసు’ను సైతం కవ్వించగలడు

‘దేవదాసు’కు సైతం తన నటనతో  మత్తు ఎక్కించగలడు..

తెలుగు సినిమాకు రెండు కళ్ళయిన ‘ఇద్దరు మిత్రుల’లో  ‘భలే రాముడు’..

‘తెనాలి రామలింగడి’లా ఎప్పుడూ ఇతరులను సరదాగా నవ్వించే ‘దసరా బుల్లోడు’

‘ప్రేమనగర్’ లో నిరంతరం సంచరించే  ప్రేమ ‘బాటసారి’

చదువు రాని ‘పల్లెటూరి పిల్ల’లతో

‘చదువుకున్న అమ్మాయిలు’ కూడా ‘ఆరాధన’ భావంతో చూసి  ‘అర్ధాంగి’ అవ్వాలనుకునే అందగాడు

ఎందరో’మూగ మనసుల’లో

‘కులగోత్రాల’తో సంబంధం లేకుండా

‘బాలరాజు’  గా ఉండేవాడు

ఆ ‘పూజా ఫలం’ అన్నపూర్ణమ్మకే దక్కింది.

జయాపజయాలు ‘వెలుగు నీడలలా’ ఉండే ‘మాయాలోకం’  సినీ ప్రపంచంలో ‘జయభేరి’ మోగించి ‘నట సామ్రాట్’ గా వెలుగొందాడు..

తెలుగు చిత్రాలకు తన చిత్రాలతో  ‘ప్రేమాభిషేకం’ చేసాడు

ఆరు పదుల వయసులో కూడా ‘కాలేజ్ బుల్లోడి’లా కనిపించాడు.

తొమ్మిది పదుల వయసులో తుది శ్వాస విడిచి  ‘కీలుగుఱ్ఱం’ ఎక్కి

‘మరో ప్రపంచా’నికి పయనమయిన  ‘మహాత్ముడు’..\

‘చుక్కల్లో చంద్రుడై’ ఇప్పటికీ వెలుగొందుతున్నాడు.

‘మనం’ మనసారా ‘నటసామ్రాట్’ అని ముద్దుగా పిలుచుకునే ‘మరపురాని మనిషి’

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *