స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్

స్వ‌చ్ఛమంటే నిర్మలం – స్వ‌చ్ఛమంటే పరిశుభ్రం
మనసు ఉండాలి నిర్మలంగా – పరిసరాలు ఉండాలి పరిశుభ్రంగా

నిర్మలం లేని మనసులు
స్వార్ధానికి మారుతాయి నిలయంగా
పగలు ప్రతీకార జ్వాలల్లో ఎగసిపడుతూ
కుటుంబాలను మారుస్తాయి కురుక్షేత్రంగా
శాంతి సుఖాలను హరించి
హాయిగా ఉన్న జీవితాల్లో హాలాహలాన్ని నింపుతాయి

మనసు స్వచ్ఛముగా లేకుంటే,
ఆలోచనలు అడ్డదారులు తొక్కి..
ఆనందమయం అయిన సమాజం
అధోగతి పాలవుతుంది

మనస్సులు నిర్మలంగా ఉంటే
జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి
అనురాగ పుష్పాలు అరవిరిసి
మానవతా పరిమళాలు గుబాళిస్తాయి

ఒళ్ళు దాటి , ఇల్లు దాటి ,
వీధి వాడలు దాటి వచ్చిన
సర్వమానవ సౌభ్రాతృత్వం
ఇంతింతై వటుడింతై అన్నరీతిగా
రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటి
విశ్వ విహారం చేస్తుంది

మానసిక శుభ్రతతో పాటు
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
పరిశుభ్రత లేని పరిసరాలు – అనారోగ్య నిలయాలు
కాలుష్య కార్ఖానాలు -క్రిమి కీటక నివాసాలు

ఆరోగ్యమే మహాభాగ్యం
పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం

ధన నష్టం కాదు మన జీవితంలో పెద్ద కష్టం
ఆరోగ్యం లేకుంటే, ధనం ఉన్నా ఏమి లాభం?

అందుకే మనసులను, పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుదాం..

Facebook
Twitter
LinkedIn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *